కాంగ్రెస్ తో చంద్రబాబు కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన తరువాత కేసిఆర్ అండ్ కో ఎన్నికల ఫైట్ ను ఆత్మగౌరవ ఫైట్ గా, మార్చే ప్రయత్నం చేసింది. దాన్ని అప్పుడే ఖండించడానికి బదులు బాబు అను'కుల' మీడియా, మరింత ఆజ్యంపోసింది. నిత్యం తెలంగాణలో హడావుడి అంతా, మహాకూటమి క్రెడిట్ అంతా చంద్రబాబుదే అన్నట్లు వార్తలు వండి వారుస్తూ వచ్చింది. చంద్రబాబు, బాలకృష్ణల ప్రచారాన్ని ఓ రేంజ్ లో చూపించే ప్రయత్నం చూపించింది.

దీంతో కేసిఆర్ అండ్ కో అందుకున్న ఆత్మగౌరవ నినాదానికి మరింత బలం వచ్చింది. కిందస్థాయి జనాలు తెలంగాణ పార్టీకే వేస్తాం అని టీఆర్ఎస్ ను ఓన్ చేసుకుంటూ చెఫ్పడం అనేక మీడియాల్లో కనిపించింది. ఇలాంటి టైమ్ లో బాబు అను'కుల' మీడియా ఎన్నికలు దగ్గరపడిన కొద్దీ బాబుకు, బాలయ్యకు ఎక్కువ ప్రచారం కలిపిస్తూ వచ్చింది.

పనిలో పనిగా ఈ వార్తలను ఆంధ్రలో కూడా చూపించి, అక్కడ కూడా బాబుకు మార్కులు తెచ్చే పని ప్రారంభించింది. ఇదంతా గమనించి కేటిఆర్ బాహాటంగానే ఆ రెండు మీడియాల పని 11 తరువాత చెబుతాం అని బాహాటంగా హెచ్చరించారు.

గతంలో ఇలాంటి స్ట్రాటజీలు పనిచేసేవి. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో అక్కడ ఏం జరుగుతోందో ఇక్కడకు తెలియడం పెద్దకష్టం కాదు. దాంతో మొత్తం రెడ్ల ఓట్లలో చీలిక వచ్చింది. కాపులు, క్షత్రియులు తదితరుల ఓట్లు వన్ సైడ్ గా మారాయి. మొత్తంమీద బాబు మీడియా తనకు తెలియకుండానే ఆయనకు చేటుచేసింది.