అవతల రజనీకాంత్ మీద, విజయ్ మీదే ఈ తరహా పోస్టర్ల విషయంలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. వాళ్లు స్టైల్ గా సిగరెట్లు పట్టుకుని పోజులు ఇవ్వడంపై పలువురు అభ్యంతరం చెప్పారు. కేసులు పెట్టారు. మరి హన్సికను తమిళ జనాలు ఊరికే వదులుతారా అని!
తన తాజా సినిమా స్టిల్స్ లో హన్సిక రెచ్చిపోయింది. ఇలా పొగతాగుతూ పోజులు ఇచ్చింది. అది కూడా కాషాయం కట్టుకుని హన్సిక ఇలా పోజులు ఇవ్వడం విశేషం. ఈ తరహా జనాలు రోడ్ల మీద కనపడరని కాదు కానీ, ఇలాంటి పోజులు తమ మనోభావాలను గాయపరిచాయని చాలామంది మండిపడే అవకాశాలున్నాయి.
హన్సిక ఈ తరహాలో పోజులు ఇవ్వడంపై వాళ్లు ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది. హన్సిక చాలా ధైర్యమే చేసినట్టుగా ఉంది. ఈ పోజుల పర్యవసనాలు ఎలా ఉంటాయో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాతో హన్సిక హాఫ్ సెంచరీ కొట్టింది. ఇది ఆమెకు యాభైయవ సినిమా.
దేశ ముదురుతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించిన నేపథ్యం ఉంది. అటు బాలీవుడ్ లో, తెలుగులో ఈమెకు అవకాశాలు లేకుండా పోయినా.. తమిళంలో మాత్రం హవా కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ కొట్టింది.

