"మ‌న్యంపులి", "జ‌న‌తాగ్యారేజ్‌", "క‌నుపాప" లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తెల‌ుగు సినీ అభిమానుల్ని ఆక‌ట్టుకున్న మ‌ళ‌యాల మూవీ లెజెండ్ మోహ‌న్‌లాల్ ఇప్పుడు 'ఓడియ‌న్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నారు. ఈ చిత్రం తెలుగు హ‌క్కులు ద‌క్కించుకున్న‌ ద‌గ్గుపాటి క్రియేష‌న్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ ఆఫ‌ర్ కి బిజినెస్ చేయ‌టం విశేషం. తెలుగులో రామ్ ద‌గ్గుపాటి, సంప‌త్ కుమార్ లు తెలుగు నిర్మాత‌లు. దర్శకుడు శ్రీ కుమార్ మీనన్.

ఈ చిత్రం మ‌ళ‌యాలంలో అత్యంత భారీ ప్రెస్టీజియ‌స్ ఫిల్మ్‌గా క్రేజ్ ని సొంతంచేసుకోవ‌ట‌మేకాకుండా అన్ని భాష‌లతో పాటు తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ రావ‌టం మెహ‌న్‌లాల్ స్టామినాని తెలియ‌జేస్తుంది. చాలా ఇంట్రస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రపంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 14న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు రామ్ ద‌గ్గుపాటి, సంప‌త్‌కుమార్ మాట్లాడుతూ.. "ఈ చిత్రం కోసం మెహ‌న్ లాల్ యోగా, వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్సరాల నుండి 35 సంవ‌త్సరాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని న‌టించిన చిత్రం కావ‌టం.. అద్బుతమైన గ్రాఫిక్స్ తో నిర్మిస్తుండ‌టంతో ఈ క్రేజీ ప్రాజెక్టుకి సౌత్ ఇండియా అంతా హ్యూజ్ క్రేజ్ వ‌చ్చింది.

ఇంత‌టి అవ‌కాశాన్ని అందించిన మెహ‌న్ లాల్ గారికి, మళయాల వెర్షన్ నిర్మాత‌లకి మా ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని మలయాళం, త‌మిళం, తెలుగు ఇండ‌స్ట్రిల్లో డిసెంబ‌ర్ 14న విడుద‌ల విడుద‌ల చేస్తున్నాం.." అని అన్నారు.