గడ్డి చామంతిలో ఆయుర్వేద విలువలతో పాటు అనేక జీవ వైవిధ్య పరిరక్షణ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క సుమారు రెండు అడుగుల పొడవు ఉండి రెమ్మలు నలువైపులా పాకుతాయి. ఈ మొక్క శాస్త్రీ య నామం ట్రైడాక్స్‌ ప్రొకంబన్స్‌. ఇంగ్లీషులో మెక్సికన్‌ డైసీ, కోట్‌ బట్టన్స్‌ అని పిలుస్తారు. హిందీలో ఘమ్రా, సంస్కృతంలో జయంతి వేద, తెలుగులో వైషాలకర్ణి, గడ్డి చామంతి, గాయపాకు, రావణాసుర తల అని పిలుస్తారు. ఆస్టరేసియో అనే పొద్దు తిరుగుడు పువ్వు కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో, ప్రస్ఫుటపు రంపపు అంచులు ఉంటాయి. ఇవి చిన్ని చామంతి పూలలాసన్నని కాడలపై లేత పసుపు రంగులో పూస్తాయి.
గడ్డి చామంతిలో ఆల్కలాయిడ్లు, ఫ్లవనాయిడ్లు, కెరోటినాయిడ్లు. వీటికి తోడు సోడియం, పొటాషియం, కాల్షియం కూడా ఎక్కువ మోతాదులో ఉన్నాయి.




ప్రయోజనాలు


* గడ్డి చామంతి ఆకు రసం రక్తస్రావాన్ని అరికడుతుంది. త్వరగా గాయాన్ని మానేట్లు చేసే శక్తి ఉన్నందున ఈ మొక్కను ‘గాయపాకు’ అని కూడా పిలుస్తారు.

* దీని రసం ఆయాసం, దగ్గు, జలుబు సమస్యలకు ఔషధం.

* ఈ మొక్కలో ఉన్న జోలియోలోనిక్‌ అనే రసాయనం కారణంగా మధుమేహం వ్యాధిని నియంత్రించవచ్చని పరిశోధనల్లో తేలింది.

* దీని పసుపు రంగు పూలు రకరకాల సీతాకోకచిలుకలను, తేనెటీగలను ఆకర్షిస్తాయి. గడ్డి చేమంతి వంటి కలుపు మొక్కలు సహితం క్రిమికీటకాదుల జీవ వైవిధ్య పరిరక్షణలో పైకి కానరాని ప్రయోజనాలను మనకు అందిస్తున్నాయి.




* చామంతి టీని ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. ఇది వడలిన చర్మం తక్షణ ఉపశమనం పొందేలా చేస్తుంది. దీనిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మగ్రంథుల లోపలివరకూ చొచ్చుకునిపోయి శుభ్రం చేస్తాయి. చర్మం తాజాగానూ ఉంటుంది. అంతేనా కాలిన గాయాలు, దోమకాటు వల్ల వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.

* చర్మంపై పేరుకున్న టాన్‌ ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తుంది. చామంతి టీని రోజూ ముఖానికి రాసుకుంటే సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌లా ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరిచి వన్నెలీనేలా చేస్తుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఫలితంగా ముఖంపై ఏర్పడే మచ్చలు వంటివి తగ్గుముఖం పడతాయి.



* నిద్రలేమి, పని ఒత్తిడి …ఇతరత్రా కారణాలు కళ్లకింద వాపు వస్తుంది. ఇలాంటప్పుడు చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటి అలసటా తగ్గుతుంది. కళ్లకింద ఏర్పడే నల్లటి వలయాలూ దూరమవుతాయి.

* కప్పున్నర పాలపొడికి, అరకప్పు చామంతి టీని చేర్చి మెత్తగా కలపాలి. దీన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దాలి. ఇది సహజ స్క్రబ్‌లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది. చర్మం తేమగానూ ఉంటుంది.

* పావుకప్పు గోరింటాకు పొడికి చామంతి టీని చేర్చి నానబెట్టాలి. దీన్ని నాలుగైదు గంటల తరవాత తలకు పట్టించి…మరో గంట ఉంచాలి. ఆపై తలస్నానం చేస్తే జుట్టుకి తగిన పోషణ అందుతుంది. మెరుపులీనుతుంది.