
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన భద్రతా సిబ్బంది ఓ ప్రయాణికుడి ప్రాణాన్ని కాపాడారు. చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి చలనంలో ఉన్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు పూర్తిగా భోగిలోకి ఎక్కలేని పరిస్థితిలో ఉండి కిందపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాగా అదే ప్లాట్‌ఫారంపై ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బందిలో ఒకరు ఇది గమనించి అతడిని క్షేమంగా బయటకి లాగారు. దీంతో సదరు ప్రయాణికుడు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
