అతని పేరు ఏ.రామచంద్రబాబు… వృత్తి సినిమాలు, టీవీల్లో నటించడం… ఇతడిపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు పదేళ్ల క్రితం కేసు నమోదు చేశారు… అప్పట్లో ముందస్తు బెయిల్ పొందిన బాబు అరెస్టు నుంచి తప్పించుకున్నాడు… ఆపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీన్ని పొడిగించుకోవాల్సి ఉండగా అలా జరగలేదు… దీంతో రామచంద్రబాబును సోమవారం అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు. ప్రధానంగా బుల్లితెర నటుడిగా ఉన్న ఏ.రామచంద్రబాబు ‘చక్రవాకం’, ‘రుతురాగాలు’ వంటి సీరియళ్లలో నటించారు. అనేక చిత్రాల్లో కథానాయకుడి తండ్రి పాత్రలతో పాటు మరికొన్ని కీలక రోల్స్ పోషించాడు. బంజారాహిల్స్‌లోని సర్వే నెం. 129/35లో ఖాదర్ భాషాతో పాటు మరి కొందరికి 3 ఎకరాలు, 21 గుంటల స్థలం ఉంది. వీరికి రూ.20 లక్షలు ఇస్తానంటూ రంగంలోకి దిగిన రామచంద్రబాబు కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నాడు.
దీంతో కంగుతిన్న శ్రీనివాస్ తనకు వాటా ఇచ్చిన స్థలం విషయంపై ఖాదర్ భాషాను సంప్రదించగా తాను స్థలాన్ని ఎవరికీ అమ్మలేదని చెప్పా డు. దీంతో శ్రీనివాస్ పాణ్యంకు చెందిన రాజకీయ నాయకుడిని సంప్రదించినా స్పందన లేకపోవడం తో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2009లో కేసు నమోదు చేసుకున్న అధికారులు రామచంద్రబాబు కోసం వేట ముమ్మరం చేశారు. దీనిని గుర్తిం చిన బాబు హైకోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు తాజాగా గత నెల్లో ముందస్తు బెయిల్ గడువు ముగిసింది. దీన్ని కోర్టు ద్వారా పొడిగించుకోవాల్సి ఉండగా అలా చేసుకోలేదు. దీంతో అధికారులు సోమవారం రామచంద్రబాబు ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో హాజరైన న్యాయవాది ఇది సాంకేతిక తప్పిదమంటూ కోర్టుకు నివేదించడంతో న్యాయస్థానం మరోసారి అతడికి బెయిల్ మంజూరుచేసింది.


