ఇటీవలే దీపావళి సమయంలో ఒట్టి బ్రాతో పోజులు ఇచ్చి విమర్శలు పాలైనా దిశా పటానీ అస్సలు తగ్గడం లేదు. ఒక బ్రాండెడ్ ఇన్నర్ వేర్స్ కు ఎండోర్స్ చేస్తున్న దిశా తన ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ ను వాటి స్టిల్స్ తో నింపేస్తోంది. ఈసారి సదరు బ్రాకు తోడు ప్యాంటీని కూడా జోడించి హాట్ ఫొటో దిగింది దిశా పటానీ.
వాటిని ధరించి బెడ్ మీద హోయలు పోయింది ఈ నటీమణి. ఇలాంటి పోజులతో రెచ్చిపోవడం ఈ నటీమణికి కొత్త ఏమీకాదు. ఇక ఈ ఫొటోను పోస్టు చేసిన వెంటనే ఈమె ఫాలోయర్లు పండగ చేసుకున్నారు. పోస్టు చేసిన గంట సేపటికే ఐదు లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.
ఇన్ స్టాగ్రమ్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న భారతీయ నటీమణుల్లో ముందుంది దిశా పటానీ. ఇలాంటి పోజులు ఇస్తుండటంతో ఈమెకు ఇన్ స్టాలో ఫాలోయర్లు భారీగా పెరిగిపోతూ ఉన్నారు.

