ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 25 నగరాలు, పల్లెల పేర్లను మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలి పిందని సీనియర్ అధికారి మీడియాకి తెలిపారు. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. పేరు మార్చడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అని, వివిధ మంత్రిత్వ శాఖల ఆమోదం తీసుకోవాలని ఆయన చెప్పారు. రైల్వే, పోస్టల్, సర్వే ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపి కొత్త పేరుతో ఇంకెక్కడైనా వేరే ఊర్లు లేవనే విషయాన్ని నిర్ధారించుకున్నాకే హోంశాఖ ఆమోది స్తుంది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ కి పంపామని దాని పై వారి నిరయ్ణం చెప్పా లని కోరినట్లు అధికారులు చెప్పారు.
ఏదైనా రాష్ట్రం పేరును మార్చాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఏడాది వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా మారింది. ఒడిశాలోని వీలర్ ఐస్‌లాండ్‌ను డా.అబ్దుల్ కలాం ఐస్‌లాండ్‌గా, కేరళలోని అరిక్కోడ్‌ను అరీకోడెగా, హరియాణాలోని పిండారిని పందు-పిండారాగా, నాగాలాండ్‌లోని షామ్‌ఫుర్‌ను షాన్‌ఫురెగా మార్చారు.



