సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ ఈ రోజు సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌’ సినిమా విడులకు ముందు ఒక టివి ఛానెల్ లో తమను కించపరుస్తూ మాట్లాడుతున్నాడని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అస్లీల సినిమాలు తీస్తున్నారని, మహిళలు అంటే ఏమాత్రం గౌరం లేదంటూ పలు మహిళా సంఘాలు విమర్శించాయి. ఈ క్రమంలోనే పలువురు మహిళలు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో రాముపై ఫిర్యాదు చేశారు.






ఆయనపై సామాజిక కార్యకర్త, మహిళా సంఘం నాయకురాలు దేవి ఐటీ ఆక్ట్ 67, ఐపీసీ సెక్షన్ 508, 509 ల కింద కేసులు నమోదు చేసారు. ఈ కేసుపైనే సీసీఎస్ ఎదుట రాము హాజరు కావాల్సి ఉంది. ఐతే సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నానంటూ రెండు సార్లు హాజరు కాలేదు. ఇవాళ కూడా విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. దీంతో వర్మ పోలీసుల ఎదుటకు వస్తారని సమాచారం. వర్మను విచారేందుకు ప్ర‌త్యేక బృందం కూడా సిద్ధంగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, మ‌రి విచార‌ణ ఏ కోణంలో సాగ‌నుంది అనే దానిపై ఆస‌క్తి నెల‌కొంది.