తెలుగులో మీడియం రేంజ్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ రెండున్న నుండి నాలుగు కోట్ల వరకు ఉంటుంది. అలాంటిది విలన్ పాత్రధారికి ఏకంగా మూడు కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు దర్శకనిర్మాతలు. ఇంతకీ విషయమేమిటంటే.. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసింది చిత్రబృందం. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. బోయపాటి సినిమాలలో ప్రతినాయకుల పాత్రలు చాలా బలంగా ఉంటాయి.
ఈ సినిమాలో కూడా విలన్ పాత్ర హీరోకి సమానంగా ఉంటుందని సమాచారం. దీని కోసం బోయపాటి బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ ను రంగంలోకి దింపారు. అతడికి కూడా పాత్ర బాగా నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే కాల్షీట్లు ఎక్కువగా అడగడం.. తన పాత్రలో వయిలన్స్ అతిగా ఉండడంతో మూడు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బోయపాటిపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు అంత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

